- కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్‌ల డిమాండ్
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న రామ భక్తులను, శ్రీరాముణ్ణి దుర్భాషలాడిన తెరాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, తెరాస నాయకులు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్‌లు డిమాండ్ చేశారు. తెరాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దాబా అభయ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఎదురుగడ్డ మైసమ్మ వరకు గచ్చిబౌలి డివిజన్ బీజేపీ జనరల్ సెక్రటరీ చెట్టి మహేందర్ గౌడ్, సురేందర్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ లు మాట్లాడుతూ శ్రీ రాముని మందిర నిధి సేకరణ చేస్తున్నరామ భక్తుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. రామ భక్తులపై దాడి చేసిన తెరాస నాయకులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా (అర్బన్) సెక్రెటరీ వసంత్ కుమార్ యాదవ్, మూలా అనిల్ గౌడ్, నీరుడి సురేష్, నక్క నరేందర్ గౌడ్, స్వామి గౌడ్, అంబటి అశోక్, సతీష్ గౌడ్, కృష్ణ యాదవ్, మరలా తిరుపతి, రావులకొల్లు వెంకటేష్, దయాకర్, కోమరగొని వెంకటేష్ గౌడ్, సురేష్ నాయక్, బీజేవైఎం ప్రెసిడెంట్ నక్క శివకుమార్, బిల్డర్ శివ, రాఘవేంద్ర కొవ్వూరి, చిట్టీ నరసింహ గౌడ్, సామ్రాట్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, సంతోష్ సింగ్, దేవేందర్ రెడ్డి, కిషన్ సింగ్, మహిళా మోర్చా ప్రెసిడెంట్ మహేశ్వరి పాల్గొన్నారు.





