శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని ఆదర్శ్ నగర్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. స్థానికంగా రోడ్డు నం.3 లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను ఆయన పరిశీలించారు. రోడ్డు పైన నిలిచిన డ్రైనేజీ నీటిని జెసిబి సహాయంతో తొలగించి ఈ సమస్య పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వర్క్ ఇన్స్పెక్టర్ కి సూచించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ నిర్మాణంపై తగు సూచనలు చేశారు. ఇంకా ఏర్పాటు చేయవలసిన నూతన డ్రైనేజీ లైన్ గురించి ఏఈ సునీల్ కి వివరించారు. స్థానికుల కోరిక మేరకు నూతన రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాసు, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నెహ్రూ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్, ఘణపురం రవీందర్, సుధాకర్ రెడ్డి, సాయి, వర్క్ ఇన్స్పెక్టర్ యాదగిరి పాల్గొన్నారు.







