సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసి రిటైర్ అయిన ఇద్దరు సిబ్బందికి సోమవారం పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వర్తించి రిటైర్ అయిన కె.నిరంజన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తించి రిటైర్ అయిన బి.సువర్ణ రాజులను ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ సన్మానించారు. వారికి ఆయన వారి పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, అడ్మిన్ ఏడీసీపీ లావణ్య ఎన్జేపీ, సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భద్రా రెడ్డి, సభ్యుడు కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.






