నమస్తే శేరిలింగంపల్లి: కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ దంపతులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి దేవిని దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా మహారాష్ట్ర వెళ్లిన పూజిత, జగదీశ్వర్ గౌడ్ లు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా మారాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.