- సగరుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఈటల
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సగరుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం సగర సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిసి కులాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని అన్నారు. సగరులకు కోకాపేటలో కేటాయించిన ఆత్మ గౌరవ భవన స్థలం మార్చకుండా ముందుగా కేటాయించిన స్థలాన్ని కొనసాగించేందుకు అధికారులతో చర్చిస్తానని అన్నారు. సగరుల ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల భిక్షపతి సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయేంద్ర సగర, రామస్వామి సగర, ఎం. రాములు సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు పెద్దబుద్దుల సతీష్ సగర, ఎంబీసి డిఎన్టీ అధ్యక్షుడు సంగెం సూర్యారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్.బి. ఆంజనేయులు సగర, మాజీ ప్రధాన కార్యదర్శి రాంసగర, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కొండయ్య సగర, సూరంపల్లి బాబురావు సగర, కార్యనిర్వాహక కార్యధర్శులు ఆంజనేయులు సగర, భాస్కర్ సగర, యువజన సంఘం సంయుక్త కార్యాధర్శి సాయి గణేష్ సగర, కార్యనిర్వాహక కార్యధర్శి మహేందర్ సగర, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాధంశెట్టి కృష్ణ సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.రవి సగర, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు సగర, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు సగర, పలు ప్రాంతీయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.