కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డా.గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలతో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కలిశారు. మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన హమీద్‌పటేల్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.