ప్ర‌తి ఒక్క‌రూ మాన‌వ హ‌క్కుల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి

  • ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ లోని ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ లీగల్ అడ్వైజర్ కేవీఎల్‌ జయసింహ కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ టి.సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కులపై అవగాహన సదస్సు నిర్వ‌హించారు. అనంత‌రం సంఘం నూత‌న సంవ‌త్స‌ర డైరీ, క్యాలెండ‌ర్‌ల‌ను ఆవిష్క‌రించారు.

ప్రపంచ మానవ హక్కుల సంఘం డైరీ, క్యాలెండ‌ర్‌ల‌ను ఆవిష్క‌రించిన సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాన‌వ‌ హక్కుల‌పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా ఉపేక్షించేది లేదని అన్నారు. హక్కుల పరంగా ఎటువంటి సమస్య వచ్చినా ప్రపంచ మానవ హక్కుల సంఘం సభ్యులను ఆశ్రయిస్తే తప్పకుండా వారికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.

ప్రపంచ మానవ హక్కుల సంఘం ఏపీ రాష్ట్ర చైర్మన్ జి.పి.నరసింహులు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ టి.సంతోష్ రెడ్డిలు మాట్లాడుతూ సమస్య ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, ప్రజల హక్కుల పరంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా త‌మ‌ ప్రపంచ మానవ హక్కుల సంఘం ముందు ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి ప్రాథమిక హక్కులను తెలుసుకోవాలని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం చైర్ పర్సన్ డి.గీతారెడ్డి, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా చైర్మన్ పి.హరీష్, తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ ఎ.జంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ లీగల్ అడ్వైజర్ కె.ఎల్. నరసింహారావు, జి.సురేష్, మహిళా విభాగ డైరెక్టర్ టి.సంధ్యారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా చైర్మన్ వర్ధమాన్ మోహన్ చారి, మేడ్చల్ జిల్లా మహిళా విభాగ కో-ఆర్డినేటర్ జి.తులసి, వనపర్తి జిల్లా చైర్మన్ ఎల్.తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ వి.తిరుపతి రెడ్డి, కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి, యాదగిరి – భువనగిరి జిల్లా వర్కింగ్ చైర్మన్ కే మహేష్, జాయింట్ సెక్రెటరీ బి.పరమేష్, మహిళా విభాగ కో ఆర్డినేటర్ ఆర్.పద్మ, మేడ్చల్ జిల్లా నుండి టి. అనంతలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ కే సరస్వతి, సెక్రెటరీ జి.లావణ్య, సి.నీల, డి.గణిత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here