ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు మే 3వ తేదీ నుంచి ? త‌్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న ?

హైద‌రాబాద్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు మే 3వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇంట‌ర్‌కు చెందిన ముఖ్య‌మైన స‌బ్జెక్టుల‌కు గాను ప‌రీక్ష‌ల‌ను మే 19వ తేదీతో ముగించాల‌ని, ఇత‌ర ప‌రీక్ష‌ల‌ను మే 24వ తేదీతో పూర్తి చేయాల‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలిసింది. అధికారులు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన టైమ్ టేబుల్‌ను రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ నెల చివ‌ర్లో ప్రారంభించి మే 2వ వారం వ‌ర‌కు పూర్తి చేయాల‌ని భావించారు. కానీ ఏప్రిల్ 27 నుంచి 30 వ‌ర‌కు జేఈఈ అడ్వాన్స్‌డ్ 3వ విడ‌త ప‌రీక్ష‌లు ఉన్నందున, మే 24 నుంచి చివరి విడత ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నందున ఇంటర్ ప‌రీక్ష‌ల‌ను మే 3వ తేదీన ప్రారంభించి మే 24వ తేదీ వ‌ర‌కు పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది. దీనిపై అధికారులు ఇంకా ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here