నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్య లో నిర్మించతలపెట్టిన శ్రీ భవ్య రామ మందిరం నిర్మాణం కోసం రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిధి సేకరణ ప్రక్రియ శేరిలింగంపల్లి లో రామ భక్తులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.
వివేకానంద నగర్ డివిజన్ లో…
డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ లో మందిర నిర్మాణ విరాళాల కార్యక్రమాన్ని స్థానిక బిజెపి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ భక్తులు ఉప్పల ఏకాంత్ గౌడ్, నామాల శ్రీనివాస్, ఉప్పల విద్యా కల్పన గౌడ్, ఉప్పల శృతి గౌడ్, లక్ష్మీనారాయణ, గోపాలకృష్ణ, భాను యాదవ్ తదితరులు స్థానికంగా పర్యటించి విరాళాలు సేకరించారు.
రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడం అదృష్టం: ఎల్లేశ్
రామజన్మభూమి అయోధ్యలో చేపడుతున్న భవ్య రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడం అదృష్టమని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి ఎల్లేష్ అన్నారు. బుధవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి లింగంపల్లి గ్రామంలో పాదయాత్ర చేస్తూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహసముద్రంపై సేతు నిర్మాణంలో ఉడుత అత్యంత భక్తితో సహకారం అందించినట్లుగా ఈ పవిత్ర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గోపినగర్ లో…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ లో స్థానిక రామ భక్తులు మందిర నిర్మాణ విరాళాల సేకరణను చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పుట్ట శ్రీకాంత్ గౌడ్, మహేష్ గౌడ్, పాండు గౌడ్, వీరాజ్ గౌడ్, అరవింద్ గౌడ్, సత్య కుర్మ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.