రేగోడ్ (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామంలో శుక్రవారం యువ చైతన్య యూత్, వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి సీనియర్ జర్నలిస్ట్ నర్సింహులు, ఆయన కుమార్తె అనూషలు బహుతులను ప్రదానం చేశారు. మొదటి బహుమతిని విజేత ప్రభురేఖకు, రెండో బహుమతిని ప్రియాంకకు, మూడో బహుమతిని వడ్ల స్వాతిలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూలమ్మ, ఉపసర్పంచ్ పోచమ్మ, జర్నలిస్టు నర్సింహులు, యువజన సంఘాల నాయకులు నందకుమార్, అంజి బాబు, నాయకుడు సంతోష్ కుమార్, యువ చైతన్య, వీరభద్ర యూత్ నాయకులు పాల్గొన్నారు.