మాదాపూర్‌లో ఘ‌నంగా స్వామి వివేకానంద జ‌యంతి

మాదాపూర్‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స్వామి వివేకానంద 158వ‌ జయంతి సంద‌ర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్ లో నరేష్ రెడ్డి, ఠాకూర్ అరవింద్ సింగ్ ల ఆధ్వర్యంలో న్యూహఫీజ్ పేట్ లోని ఆదిత్య నగర్, కృష్ణ కాలనీ, సుభాష్ చంద్ర బోస్ నగర్, ఇజ్జత్ నగర్ కాలనీల‌లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, అంగన్‌వాడీ విద్యార్థులకు పండ్లు, ఫ‌లహారాలు పంపిణీ చేశారు.

విద్యార్థుల‌కు విద్యా సామ‌గ్రిని పంపిణీ చేసిన బీజేపీ నాయ‌కులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాదాపూర్ డివిజ‌న్‌ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి గంగుల రాధా కృష్ణ యాదవ్, నరసింహ యాదవ్ లు హాజ‌రై మాట్లాడుతూ స్వామి వివేకానంద 1863వ సంవ‌త్స‌రం, జ‌న‌వ‌రి 12వ తేదీన జ‌న్మించార‌ని అన్నారు. ఈయ‌న‌కు అంత‌కు ముందు న‌రేంద్ర నాథ్ ద‌త్త అనే పేరు ఉండేద‌న్నారు. రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస‌కు ఈయ‌న ప్రియు శిష్యుడ‌ని తెలిపారు. వివేకానందుడు దేశ ఖ్యాతిని న‌లుదిశ‌లా వ్యాపింప‌జేసిన గొప్ప వ్య‌క్తి అని కొనియాడారు. ఆయ‌న జ‌యంతిని యువ‌జ‌న దినోత్స‌వంగా జరుపుకుంటుండ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మధు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, హరి ప్రియ, రాజేశ్వర్ రెడ్డి, బాలునాయక్, శ్రీనివాస్ యాదవ్, డివిజ‌న్ బీజేవైఎం అధ్యక్షుడు ఆనంద్, ఉపాధ్యక్షులు పట్నం రాము, చరణ్, ఖలీల్, మహిళా మోర్చా నాయకురాలు భారతి, చంద్రకళ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here