సాయిరాం బ్రిక్స్ డైరీని ఆవిష్కరించిన కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ తెరాస నాయకులు కార్పొరేటర్ హమీద్ పటేల్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా డివిజన్ తెరాస సెక్రటరీ బలరాం యాదవ్ ఆధ్వ‌ర్యంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ చేతుల మీదుగా సాయిరాం బ్రిక్స్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంత‌రం కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జె బలరాం యాదవ్, వార్డు మెంబర్ జంగం గౌడ్, సీనియర్ నాయకులు హనుమంతు రెడ్డి, రాజా మోహన్ రావు, రమేష్ యాదవ్, మల్లికార్జున్, కమలాకర్ రావు, సందీప్, గణేష్ పాల్గొన్నారు.

సాయిరాం బ్రిక్స్ డైరీని ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here