మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సరం సందర్భంగా మాదాపూర్ డివిజన్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్‌ను కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్‌ను జగదీశ్వర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకారం వెంకటేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మ్యాడం బాలాజీ గుప్తా, కోశాధికారి మాదిరి హరిశంకర్ గుప్తా, శర్వా లింగం, అశోక్ కుమార్, శ్రీనివాసులు, పరమేశ్వర గుప్తా, మధు, భాస్కర్, రాజు, శివ, బాలరాజు, టీఆర్ఎస్ నాయకులు శ్యామ్, బాబూమోహన్ మల్లేష్, శంకర్ పాల్గొన్నారు.






