శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శిష్టకరణం సంక్షేమ సంఘం అభివృద్ధి పథంలో నడిచేందుకు కృషి చేస్తానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం వార్డు కార్యాలయంలో శిష్టకరణం సంక్షేమ సంఘం క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు డి.వి.కృష్ణా రావు మాట్లాడుతూ శిష్టకరణం సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణం సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి.విజయకుమార్, ఉపాధ్యక్షుడు ఆర్ శేషగిరిరావు, సంయుక్త కార్యదర్శి నారాయణ రావు, పార్వతీశ్వర రావు, పి.ఆర్.ప్రకాష్ రావు, ప్రతాప్ రాజ్, వికాష్, హరగోపాల్, పార్థసారథి, గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, సాయి పాల్గొన్నారు.






