ఆద‌ర్శ్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన కార్పొరేట‌ర్ రాగం

శేరిలింగంపల్లి(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి) శేరిలింగంపల్లి డివిజ‌న్‌ పరిధిలోని ఆదర్శ్ నగర్ లో స్థానిక కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ జ‌ల‌మండ‌లి అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రోడ్డు నెం.3 లో గల మంజీరా నీటిలో డ్రైనేజీ క‌లిస్తుంద‌ని స్థానిక ప్ర‌జ‌లు కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. స‌మ‌స్య‌పై స్పందించిన రాగం నూతన పైప్ లైన్ వేసి శాశ్వత పరిష్కారం చూపాల‌ని, స‌మ‌స్య పునరావృతం కాకుండా తగినా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు నూతనంగా ఏర్పాటు చేయాల్సిన మంజీరా పైప్‌లైన్ గురించి అధికారులకు వివ‌రించారు. మంజీరా పైప్‌లైన్ ఏర్పాటైన అనంత‌రం సిసిరోడ్ల నిర్మాణం సైతం చేప‌డుతామ‌ని రాగం తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో రాగంతో పాటు జ‌ల‌మండ‌లి ఎఈ యాద‌గిరి, వర్క్ ఇన్స్పెక్టర్ మోహన్ మాజీ కౌన్సిలర్ సోమదాసు, గోపినగర్ బస్తి కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పెట్లోళ్ల నర్సింహా రెడ్డి, సాయి, రాకేష్ యాదవ్, వినయ్ గౌడ్ త‌దితరులు పాల్గొన్నారు.

ఆద‌ర్శ్‌న‌గ‌ర్ లో అధికారుల‌తో క‌లిసి స‌మ‌స్య‌లు ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్ యాద‌వ్‌

ఉచిత వైద్య‌శిభిరాన్ని ప్రారంభించిన రాగం…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల లింగంపల్లి ఓల్డ్ విలేజ్ జిల్లాపరిషత్ బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌లో మాజీ కౌన్సిలర్ పొట్ట నాగేశ్వరరావు యాదవ్ జ్ఞాపకార్థం సిగ్మా హాస్పిటల్ మాదాపూర్ వారు నిర్వ‌హించిన ఉచిత వైద్య‌శిభిరాన్ని కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌రై ప్రారంభించారు. శిభిరంలో పాల్గొన్న స్థానిక ప్ర‌జ‌ల‌కు వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి రాగం చేతుల మీదుగా మందుల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాగం మాట్లాడుతూ సేవా దృక్ప‌థంతో ఏర్పాటు చేసే వైద్య శిభిరాల‌ను ప్ర‌జ‌లంద‌రూ వినియోగించుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. సుమిత్ పాటిల్ నాయ‌కులు మల్లికార్జున్ యాదవ్, లింగం శ్రీను, రాములు గౌడ్, మల్లేష్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, రవి యాదవ్, నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు


శిభిరార్థుల‌కు మందులు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here