హఫీజ్‌పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ సేవాదళ్ చైర్మన్ వినోద్‌రావు జన్మదిన వేడుకలు మదీనగుడలోని ఆయన నివాసంలో ఆదివారం నిరాడంబరంగా జరిగాయి. ఆ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మక్త రాజేష్ గౌడ్, గుండె గణేష్ ముదిరాజ్‌లు వినోద్‌రావుచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. తమ నాయకుడు ఆయురారోగ్యఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు రాజేష్ గౌడ్, గణేష్ ముదిరాజ్‌లు పేర్కొన్నారు.