- గవర్నమెంట్ కాలేజీలో విజయలక్ష్మీకి ఎం.బి.బి.ఎస్ సీటు
- శభాష్ అంటూ అభినందించిన మంత్రి హరీశ్ రావు
- సహాయ, సహకారాలు అందిస్తామని వెల్లడి
- ఐదేండ్ల వరకూ చదువుకయ్యే ఖర్చులు భరిస్తామంటున్న సర్వోదయ ఫౌండేషన్
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ లో నివాసం ఉంటున్న సంగమేషు ముదిరాజ్ (నారాయణ ఖెడ్ వాసి) చెల్లెలు, బావలు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడి మృతి చెందగా వారి పిల్లలు అనాథలయ్యారు.
అప్పటినుంచి వారి పిల్లలు సంగామేషు సంరక్షణలో నివసిస్తున్నారు. పెద్దమ్మాయి మహేశ్వరి బాచుపల్లి మమత కాలేజీలో బి.ఎస్సీ నర్సింగ్ పైనల్ ఇయర్ చదువుతున్నది, అబ్బాయి జగదీష్ నారాయణ ఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వీరిని సంగమేషు మిత్ర బృందం కొంతమంది దాతల సహాయ సహకారంతో చదివిస్తూ వస్తున్నారు. అయితే రెండవ అమ్మాయి విజయలక్ష్మికి మహబూబాద్ గవర్నమెంట్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ సీటు రావడంతో .. విషయం తెలుసుకున్న సర్వోదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సమాజ సేవకులు, ఐ.అర్.ఎస్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ ఆమె చదువుకునేందుకు చేయూతనందించారు. 5 సంవత్సరాల ఎం.బి .బి.ఎస్ పూర్తయ్యేంత వరకు ప్రతి నెల హాస్టల్ ఫీజుతోపాటు మిగతా ఖర్చులు తన ఫౌండేషన్ నుంచి చెల్లిస్తామని తెలిపారు. పట్టుదలతో కష్టపడి చదివి గవ్నమెంట్ కోటలో ఎం.బి.బి.ఎస్ సీట్ సాధించడం గర్వకారణమని, ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పారు.
నారాయణ ఖేడ్ కు చెందిన వీరి పేపర్ లో ప్రచురితమవ్వడం.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆ వార్త ను చూసి విజయలక్ష్మి ప్రతిభను చూసి శభాష్ అంటూ మెచ్చుకున్నారు.. తమవంతు సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. సంగమేశ్ మాట్లాడుతూ మానవత్వం, మంచితనంతో తన సోదరి పిల్లలకు విద్యా దానం చేసిన, ఇప్పుడు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ తనకు సహరించిన తన మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.