నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

  • అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు
  • సంబురాల్లో నిమగ్నమైన బీజేపీ శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి : నూతన పార్లమెంట్ భవనంలో మహిళలకు చట్ట సభల్లో 33 % రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి , ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి , టపాకాయలు కాల్చి, స్వీట్స్ పంచి మహిళలకు అభినందనలు తెలిపారు.

వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, కాంటెస్టడ్ కార్పొరేటర్ సింధురెడ్డి, రాధాకృష్ణ యాదవ్ , మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ పద్మ, జిల్లా నాయకురాలు వరలక్ష్మి, వినితా సింగ్, డివిజన్ ప్రెసిడెంట్ అరుణ, మేరీ, విజయలక్ష్మి, పార్వతి , సుజాత , మహిళా నాయకులు, సీనియర్ నాయకులు వినోద్ రావు, చంద్రశేఖర్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, రాజేష్ గౌడ్ , అర్జున్, యాదగిరి , శ్రీశైలం, నరసింహ, శివ, ఉపేంద్ర , శ్రీనివాస్, నందగోపాల్, సాగర్, రాజు, దేవేందర్ , కార్యకర్తలు ఉన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% సీట్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటం మనమందరం గర్వించదగ్గ విషయమన్నారు.

ఈ బిల్లు ద్వారా అన్ని వర్గాల మహిళలకు ప్రాధాన్యత కలుగుతుందని తెలిపారు. ఒక రాష్ట్ర అసెంబ్లీలో 100 సీట్లు ఉంటే, 33 మహిళలకు రిజర్వ్ చేస్తే, ఆ 33లో 11 ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు ఇవ్వబడతాయన్నారు , మహిళల కోసం , వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here