నమస్తే శేరిలింగంపల్లి : అర్హులైన నిరుపేద బీసీలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించి పంపిణీ చేయాలని శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక చైర్మన్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎమ్మార్వో డిప్యూటీ కలెక్టర్ కి మెమోరాండం సమర్పించారు.
శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలో ఎన్ని డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించారో.. ఎన్ని పంపిణీ చేశారో తెలపాలని విన్నవించారు. స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఇండ్లు నిర్మించుకునేలా చేయాలని కోరారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కె సాయన్న, మియాపూర్ బీసీ అధ్యక్షుడు నరసింహులు ముదిరాజ్ లు మాట్లాడుతూ ముదిరాజుల దామాషా జనాభా ప్రకారం అత్యధికంగా ఉన్న ముదిరాజులకు ఇల్లు కేటాయించాలని కోరారు. వెంకటేష్, సుధాకర్ బిసి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.