మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, ఓంకార్ నగర్ లలోనీ వరద ముంపు ప్రాంతాలను ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్‌లు బుదవారం సందర్శించారు. న్యూ కాలనీ వద్ద వరద ఉదృతికి దెబ్బతిన్న నివాసలను పరిశీలించి బాదితులకు ధైర్యం చేప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాదిత కుటుబాల పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు లోతట్టు ప్రాంతాలను గుర్తించి, వరదనీటి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మక నాగభూషణం, విమల, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.