గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొమరగౌని సురేష్ గౌడ్ శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం వారి నివాసంలో గాంధీని కలిసిన సురేష్ గౌడ్ పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. గాంధీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.