చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్, లింగంపల్లి, నెహ్రూనగర్‌లలో బిజేపీ రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్ పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన ఆయ ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలించారు. సహాయక చర్యల్లో పాల్గొని వరద బాదితులకు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టారెడ్డి ప్రసాద్, ప్రశాంత్‌చారీ తదితరులు పాల్గొన్నారు.