నమస్తే శేరిలింగంపల్లి: ఇటీవల చందానగర్ జిహెచ్ఎంసి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న వంశీకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిశారు బిఆర్ ఎస్ నేత, ఉద్యమకారుడు మిద్దెల మల్లారెడ్డి. అనంతరం పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చందానగర్ సర్కిల్ లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అంతేకాక ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ అక్రమ కట్టడాలను నిలుపుదల చేస్తూ జీహెచ్ ఎంసీకి ఆదాయం పెంచాలని, టీడీఆర్ లను ప్రోత్సహించాలని కోరారు.