మియాపూర్ వ‌డ్డెర బ‌స్తీ, బాలాజీన‌గ‌ర్ వాసుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి: ప‌ల్లెముర‌ళి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని వ‌డ్డెర బ‌స్తీ, బాలాజీ న‌గ‌ర్ వాసులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఎఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర అధ్య‌క్షులు ప‌ల్లెమురళి జిహెచ్ఎంసి అధికారుల‌కు మెమొరాండం స‌మ‌ర్పించారు. గురువారం చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మీష‌న‌ర్‌ను క‌లిసిన ఆయ‌న మెమొరాండం స‌మ‌ర్పించి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. వ‌డ్డెర బ‌స్తీలో గ‌త జిహెచ్ఎంసి ఎన్నిక‌ల‌కు ముందు రోడ్డును త‌వ్వి భూగ‌ర్భ డ్రైనేజీ ప‌నులు చేప‌ట్టార‌ని, రోడ్డుపై కుప్ప‌లుగా ప‌డి ఉన్న మ‌ట్టిని నెల‌లు గ‌డ‌స్తున్నా తొల‌గించ‌డం లేద‌న్నారు. దీని కార‌ణంగా ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని తెలిపారు. వడ్డెర బస్తీ కి రోడ్డు మంజూరై నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కావడం లేద‌న్నారు. బొల్లారం ప్రధాన రోడ్డు పక్కన ఉన్న బాలాజీ నగర్ వీకర్ సెక్షన్లో సుమారు 25 ఏళ్ల కిందట వేసిన మంజీరా లైన్ మరియు రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తిగా ధ్వంసమై తాగే నీళ్లలో డ్రైనేజీ వాటర్ కలిసి వ‌స్తుంద‌ని తెలిపారు. వెంట‌నే అధికారులు స్పందించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న కోరారు.

జిహెచ్ఎంసి కార్యాల‌యం వ‌ద్ద స్థానిక స‌మ‌స్య‌ల‌పై రూపొందించిన మెమొరాండం చూపుతున్న ప‌ల్లెముర‌ళి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here