నమస్తే శేరిలింగంపల్లి: భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. ఇందులో భాగంగానే విస్డం గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మారోజు.లక్ష్మీఆచార్య రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఆమెకు ఖైరతాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవార్డును అందజేశారు.