- లింగంపల్లి ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా డ్రైనేజీ లైన్ వర్క్ తో తరచూ సమస్య
- దుకాణాలు తెరుచుకోలేకపోతున్నాం..
- మురుగులో మునుగుతున్న షాపులు.. తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన
- న్యాయం చేయాలనీ వేడుకోలు
నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి ఫ్లైఓవర్ పనుల వల్ల తాము తీవ్రంగా నష్టపోయాం.. మునుపటిలాగే మూడు షాపులు మునిగిపోయాయి.. డ్రైనేజీ లైన్ వర్క్ తొందరగా పూర్తి అయితే బిజినెస్ నడుస్తుందనుకున్నాం.. కానీ మా కష్టం నీటి పాలవుతున్నదని నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి తరచూ ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్జికల్ షాప్ నిర్వాహకులు.
చందానగర్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద మూడు సర్జికల్ షాపులు నిత్యం లింగంపల్లి ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా డ్రైనేజీ లైన్ వర్క్ వల్ల తరచూ మురుగు నీటిలో మూలుగుతున్నాయి. సమస్య నెలకొన్న ప్రతిసారి షాప్ లు మోసుకోవాల్సిన దుస్థితి నెలకొంటున్నదని, నాలుగు నెలలుగా ఏ సమస్య తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టిందని, తమను ఆదుకోని న్యాయం చేయాలనీ కోరుతున్నారు.