పార్టీ స్వంత ప‌నుల‌కు వార్డు, క్యాంపు కార్యాల‌యాల వినియోగం చ‌ట్ట‌విరుద్ధం: క‌సిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి

చందాన‌గ‌ర్(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి) ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం ఏర్పాటు చేసిన వార్డు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను టిఆర్ ఎస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించుకోవ‌డాన్ని ఖండిస్తున్న‌ట్లు బిజెపి రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. టిఆర్ ఎస్ పార్టీ త‌ల‌పెట్టిన స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని పార్టీ కార్యాల‌యంలోనో, మ‌రే ఇత‌ర ప్రాంతంలోనైనా నిర్వ‌హించుకోవాల‌న్నారు. ప్రజాధనంతో నిర్మించిన క్యాంపు, వార్డు కార్యాలయాలలో పార్టీ సంబంధ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌ జీహెచ్ఎంసీ చట్టాల‌ ఉల్లంఘన కిందికి వస్తుందని సంబంధిత ఎమ్మెల్యే, కార్పొరేటర్ లపై, టీఆర్ఎస్ నాయకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బిజెపి త‌ర‌పున డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ క్యాంపు కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడం పై కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నద‌ని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఈ అధికార ప్రతినిధులు నైతిక విలువలు లేకుండా వ్యవహరించడాన్ని బిజెపి గర్హిస్తున్నామ‌న్నారు. ఈ విష‌యాన్ని చట్ట పరిధిలో అన్ని విభాగాల దృష్టికి తీసుకెళ్లి అధికార పార్టీ తీరును ఎండ‌గ‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here