చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): దీప్తీశ్రీనగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి మొదలయ్యింది. ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ అభయాంజనేయ స్వామి సముఖమున 32 అడుగుల ఏకశిలా ధ్వజస్థంభ ప్రతిష్టా, శ్రీ కుమార స్వామి సన్నిధానంలో వల్లీ దేవసేనుల విగ్రహ ప్రతిష్టాపణ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ మారుతి శర్మ పర్యవేక్షణలో క్రతువులు మొదలయ్యాయి. మంగళవారం వసంత పంచమి వేళ మధ్యాహ్నం 12.08 గంటలకు అభిజిత్ లగ్నంయందు యంత్ర ప్రతిష్ట జరుగుతుందని వారు తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి పిలుపునిచ్చారు.