నమస్తే శేరిలింగంపల్లి: ఎంఏ నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హామీ ఇచ్చారు. అయితే మియాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై ఎం ఏ నగర్ కాలనీ వాసులు ఆయనను కలిసి విన్నవించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడారు. ప్రభుత్వ విప్ గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కృష్ణ రావు, లసని రాజు, అనిల్, డప్పు రాములు, మధు, వెంకటేష్, ఆంజనేయులు, వీరన్న పటేల్, మల్లేష్ , వెల్డింగ్ రాజు, అనిల్ రెడ్డి, యాదయ్య, శివ ముదిరాజ్, అవినాష్ , పాండు, లక్ష్మణ్, సంతోష్ పాల్గొన్నారు.