డ్రైనేజీ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ గిద్దంగి బస్తిలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా వేయనున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులకు ప్రభుత్వ విప్, అరేకపూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ పాదయాత్రగా పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేసే పనులను చేస్తుందని అన్నారు.

గిద్దండి బస్తీలో వేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ పనులు పూర్తయిన వెంటనే దానిపై రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏజీఎం సుబ్రహ్మణ్యం రాజు, డిజిఎం నాగప్రియ, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, యాదగిరి గౌడ్, కటిక రామ్ చందర్, గోవింద్ చారీ, గడ్డం రవి యాదవ్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శశికాంత్, దర్గా మధు ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, నాగేష్ ముదిరాజ్, మహేష్ ముదిరాజ్, శివదత్తు, సుశాంత్, రాజు, భార్గవ్, సుధాకర్, సురేష్, ప్రేమ్నాథ్, లక్ష్మణ్, నరేష్, సయ్యద్ నయీమ్, రవికిరణ్, రంజిత్, ప్రవీణ్, సత్యనారాయణ, నర్సింహా, సాయినందన్, తుకారాం, పెంటయ్య, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, ముంతాజ్ బేగం, నిరూప, దివ్య, చంద్రకళ, సరిత, ఉమా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here