అయోధ్య రామ మందిరానికి తునికి రాఘ‌వేంద‌ర్ రావు రూ.1,01,116 నిధి స‌మ‌ర్ప‌ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అయోధ్య‌లో నిర్మిత‌మ‌వుతున్న శ్రీ‌రామ భ‌వ్య మందిర నిర్మాణానికి శేరిలింగంప‌ల్లి ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖ న్యాయ‌వాది, అక్షిత క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ అధినేత తునికి రాఘ‌వేంద‌ర్ రావు రూ. 1,01,116 నిధి స‌మ‌ర్ప‌ణ చేశారు. బుధ‌వారం జిల్లాప‌రిష‌త్ మాజీ వైస్‌చైర్మెన్ నంద‌కుమార్ యాద‌వ్‌, ఆర్ ఎస్ ఎస్ భాగ్ స‌హ కార్యావ‌హ్ యాద‌గిరి, బిజెపి రంగారెడ్డి అర్బ‌న్ జిల్లా ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌, నాయ‌కులు అందెల కుమార్‌యాద‌వ్‌, రామ‌సేవ‌కులు పుట్ట విన‌య‌కుమార్ ల‌కు చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రాఘ‌వేంద‌ర్ రావు మాట్లాడుతూ రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం ప్రతీ ఒక్క హిందువు కల అన్నారు. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ముందుకు వస్తున్నారన్నారు. మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రామకార్యంలో భాగ‌స్వాములైన రాఘ‌వేంద‌ర్ రావు కు రామ‌సేవ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

రామ మందిర నిధి స‌మ‌ర్ప‌ణ చెక్కును అంద‌జేస్తున్న రాఘ‌వేంద‌ర్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here