తుల్జాభవాని అమ్మవారికి రాగం దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు

 

అమ్మ‌వారి పూజా కార్య‌క్రమంలో పాల్గొన్న రాగం దంప‌తులు

శేరిలింగంప‌ల్లి‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు శ‌నివారం లింగంప‌ల్లి తుల్జాభవాని అమ్మవారి ఆలయంలో శ‌నివారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా మొద‌టి రోజు అమ్మ‌వారు బాలత్రిపుర సుందరి స్వరూపంలో ద‌ర్శ‌న‌మిచ్చారు. దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని మొదటి రోజున రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా అమ్మవారి వద్ద కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన బ్యాగులను పెట్టి రాగం సుజాత నాగేందర్ యాదవ్ దంపతులు పూజలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు, నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ, ఆలయ ఈఓ విజయభారతి, కమిటీ సభ్యులు రేణుక, సంజీవరెడ్డి, గోవింద్ చారి, సంపత్ తో పాటు తారానగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు జనార్థన్ గౌడ్, యాదగిరిగౌడ్, నట్ రాజ్, గోపి తదితరులు ఉన్నారు.

సంక్షేమ పథ‌కం బ్యాగుల‌తో రాగం సుజాత నాగేంద‌ర్ యాద‌వ్ దంప‌తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here