కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రేమ్ నగర్ బి బ్లాకు లో కొనసాగుతున్న సహాయక చర్యలను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ్ నగర్ బి బ్లాకు లో పెద్ద నాలాలో గత రెండు రోజులుగా హిటాచీ ప్రొక్లైనర్ సహాయంతో పూడిక తీత పనులను, నాలా విస్తరణ పనులను చేయించుట జరుగుతున్నదని అన్నారు. ప్రస్తుతానికి మురుగు నీరు పోవటానికి వీలుగా చిన్న సిమెంట్ పైపులను తొలగించి, పెద్ద సిమెంట్ పైపులను వేయిస్తున్నట్టు తెలిపారు. అక్కడ త్వరితగతిన కల్వర్ట్ నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రూపారెడ్డి, ప్రేమ్ నగర్ బి బ్లాకు ప్రెసిడెంట్ కన్నారావు, సెక్రటరీ నరసింహులు గౌడ్, గిరి గౌడ్, సత్యం గౌడ్, లావణ్య, రామ స్వామి గౌడ్, యాదగిరి, వెంకటేష్, రాఘవేందర్, ఎల్లయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.