హైదర్ నగర్(నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం అద్వర్యంలో ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీపై రూపొందించిన పాటల సీడిని గాంధీ వారి నివాసంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీయూఎస్ బృందానికి గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ మర్రపు గంగాధర్, పీవై రమేష్ , శేరిలింగంపల్లి ప్రెసిడెంట్ కంది జ్ఞానేశ్వర్, వేముల భాస్కర్, మోహన్ నాయక్ , వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, దొడ్ల రామకృష్ణ గౌడ్, షౌకత్ అలీ మున్నా, శ్రావణి రెడ్డి, పద్మావతి , కళావతి , ఉమా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.