టిఎస్‌పిఎస్‌సి ముట్ట‌డికి త‌ర‌లిన‌ శేరిలింగంప‌ల్లి బిజెవైఎం నేత‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌నే డిమాండ్‌తో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ ఆద్వర్యంలో నిర్వ‌హించిన టిఎస్‌పిఎస్‌సి కార్యాల‌య ముట్ట‌డికి శేరిలింగంప‌ల్లి నాయ‌కులు త‌ర‌లివెళ్లారు. బిజెవైఎం రాష్ట్ర అధ్య‌క్షుడు భానుప్ర‌కాష్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి శేరిలింగంప‌ల్లి నాయ‌కులు క‌సిరెడ్డి సింధు ర‌ఘునాథ్ రెడ్డి, నంద‌నం విష్ణుద‌త్‌ల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున త‌ర‌లివెళ్లారు. నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బిజెపి నాయ‌కుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి అనంత‌రం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా బిజెవైఎం నాయ‌కులు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువత అన్యాయానికి గురవుతున్నారని, వెంటనే రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ వెంటనే అమలు చేయాలన్నారు. లేనిప‌క్షంలో రాష్ట్ర యువతను ఏకం చేసి తెరాస ప్రభుత్వాన్ని కనుమరుగు చేస్తామని హెచ్చరించారు.

టిఎస్‌పిఎస్‌సి ముట్ట‌డి కార్య‌క్ర‌మంలో క‌సిరెడ్డి సింధుర‌ఘునాథ్ రెడ్డి, నంద‌నం విష్ణుద‌త్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here