సీఎం దళిత సాధికారత పథకంతో ద‌ళితుల జీవితాల్లో గుణాత్మ‌క మార్పు క‌లుగుతుంది: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌వేశ‌పెట్టిన సీఎం దళిత సాధికారత పథకం ద‌ళితుల జీవితాల్లో గుణాత్మ‌క మార్ప క‌లుగుతుంద‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ అన్నారు. మంగ‌ళ‌వారం శేరిలింగంప‌ల్లి ఎస్‌సి సెల్ అధ్యక్షులు మోజేష్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సిఎం కెసిఆర్ చిత్ర‌ప‌టానికి కార్పొరేట‌ర్లు రోజ‌రంగారావు, దొడ్ల వెంక‌టేష్‌గౌడ్‌, నార్నె శ్రీ‌నివాస్‌రావుల‌తో క‌లిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఈ ప‌థకం ద్వారా లబ్ది దారులకు ఒక్కొ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జ‌రుగుతుంద‌న్నారు. దళిత సమాజం అభివృద్ధి కోసం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని గొప్ప నిర్ణయాన్నికెసిఆర్ తీసుకుని ద‌ళిత బాంధ‌వుడిగా నిలిచిపోయార‌న్నారు. దళిత సమాజం అభివృద్ధికి కంకణం కట్టుకొని వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తున్న టిఆర్ఎస్ ప్ర‌భుత్వానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు ,కాశినాథ్ యాదవ్, ఆంజనేయులు, అల్లం మహేష్, అష్రాఫ్ ,మహిళా నాయకురాలు విజయమ్మ, నల్లోల్ల రాము, గుడ్ల శ్రీనివాస్ అల్వాల గిరిబాబు, మద్దెల రాము, అర్జున్, సామేలు, సాయి గౌడ్, జీడి విక్రమ్, ముత్యాల రాజు, రామాంజనేయులు, కూర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here