మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ కు బహుమతిగా ఇవ్వాలని ప్రభుత్వ విప్ గాంధీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మియాపూర్ జయప్రకాష్ నగర్‌లో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన ప్రతీ కుటుంబాన్ని సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతీ నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వాసు, కిరణ్, రమేష్, శ్రీనివాస్, అవినాష్, డేవిడ్, జీవన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
