శేరిలింగంప‌ల్లిలో జోరుగా టిఆర్ఎస్ స‌భ్య‌త్వ న‌మోదు

  • కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటుంది: ప‌్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ట‌టిఆర్ ఎస్ పార్టీ ఎల్ల‌ప్పుడూ కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం చిత్త‌శుద్దితో ప‌నిచేస్తుంద‌ని, ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కూ అండ‌గా నిలిచే ఏకైక పార్టీ టిఆర్ ఎస్ అని ప్ర‌భుత్వ విప్‌, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ అన్నారు. ఆదివారం హ‌ఫీజ్‌పేట్‌, మాదాపూర్ డివిజ‌న్‌ల పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని హ‌ఫీజ్‌పేట్ వార్డు కార్యాల‌యంలో స్థానిక కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ ల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన గాంధీ పార్టీ కార్య‌కర్త‌ల‌తో స‌భ్య‌త్వ న‌మోదు చేయించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ టిఆర్ ఎస్ పార్టీకి కార్య‌క‌ర్త‌లే మూల స్థంబాల‌ని, వారి సంక్షేమం కోసం అన్నిర‌కాల చ‌ర్య‌ల‌ను పార్టీ అధిష్టానం చేప‌డుతుంద‌న్నారు. వారి క‌ష్టసుఖాల్లో పాలు పంచుకోవ‌డం త‌మ క‌ర్త‌వ్య‌మ‌ని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని నాయకులకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌత‌మ్‌గౌడ్‌తో పాటు నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌ల‌తో క‌లిసి స‌భ్య‌త్వ న‌మోదు నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ
  • కొండాపూర్ డివిజ‌న్‌లో…

కొండాపూర్ డివిజ‌న్‌లో స్థానిక కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్ ఆధ్వ‌ర్యంలో పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాల‌న్నారు. తెరాస పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుతో పాటు, సాధారణ సభ్యత్వ నమోదు జ‌రిపి పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన పధకాలను ప్రజలకు వివరించి, ప్రతి కార్యకర్త బంగారు తెలంగాణ దిశగా పనిచెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తో పాటు నాయ‌కులు గౌరీ, చాంద్ పాషా, రాజు యాదవ్, జంగం గౌడ్, తిరుపతి యాదవ్, జె బలరాం యాదవ్, రుద్ర రాజు భగవాన్ రాజు, అడ్వకేట్ కృష్ణవేణి, అర్ లక్ష్మణ్ గౌడ్, లక్ష్మి నారాయణ, ఎర్ర రాజు, ఇనాయత్, కృష్ణ సాగర్, సయ్యద్ ఉస్మాన్, జలీల్, ప్రభాకర్, మంగలి కృష్ణ, ఖాజా పాషా, గిరి గౌడ్, సాగర్ చౌదరి, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజ‌న్‌లో పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు నిర్వ‌హిస్తున్న కొర్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్‌
  • మియాపూర్ డివిజ‌న్‌లో…

మియాపూర్ డివిజన్ ప‌రిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక‌ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెరాస పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ స‌భ్య‌త్వాన్ని అంద‌జేశారు. అనంత‌రం ఉప్ప‌ల‌పాటి మాట్లాడుతూ టిఆర్ ఎస్ పార్టీ స‌భ్య‌త్వ నమోదు కార్యక్ర‌మాన్ని విజ‌యవంతంగా నిర్వ‌హించి పార్టీ ప‌టిష్ట‌త‌కు ప్ర‌తీ కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు పురుషోత్తం యాదవ్ గారు, మోహన్ ముదిరాజ్ గారు,అన్వర్ షరీఫ్ గారు,మాధవరం గోపాల్ గారు, ప్రతాప్ రెడ్డి గారు,చంద్రిక ప్రసాద్ గౌడ్ గారు,మహేందర్ ముదిరాజ్ గారు, రోజా గారు,గంగాధర్ గారు,గోపారాజు శ్రీనివాస్, కాజా పాషా, జంగిర్, స్వామి నాయక్, శ్రీధర్, దయనంద్, సంతోష్, జంగం మల్లేష్,రాజు గౌడ్, శివ, వెంకటేష్, మురళి, సుప్రజా, లావణ్య, స్వరూప, అబ్రహం, కమలాకర్, త‌దితరులు పాల్గొన్నారు

పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌
  • గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో…

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని గచ్చిబౌలి డివిజన్ లోని మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఖాజాగూడలోని తెరాసా పార్టీ కార్యాలయంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో సాయిబాబ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌భ్య‌త్వ న‌మోదు చేయించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ టిఆర్ ఎస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున చేప‌ట్టి డివిజ‌న్‌లో పార్టీ బ‌లోపేతానికి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాగం జంగయ్య యాదవ్, రాజు ముదిరాజ్, రాజేందర్ మర్ముళ్ళ, గిరి,శివ కుమార్, బాలరాజు, వెంకటేష్ ముదిరాజ్, అంజమ్మ, టీ.మాధవి, అశోక్, బాలరాజు సాగర్,బాలరాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


ఖాజాగూడ పార్టీ కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల‌తో స‌భ్య‌త్వ న‌మోదు చేయిస్తున్న మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబ‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here