నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమకారులు కోవిడ్ నిబంధనల నడుమ నిరాడంబరంగా జరుపుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా గత సంవత్సరం మాదిరిగానే హంగులు ఆర్భాటాలు లేకుండానే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

కరోనా పై యుద్ధం చేస్తూ అభివృద్ధివైపు పరుగులు పెడుతున్నాం: ప్రభుత్వ విప్ గాంధీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్మారక స్థూపం వద్ద అమరవీరులకు పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఓ వైపు కరోనాతో యుద్దం చేస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ బాటలో నడుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి, శాసన సభ్యులు కోనేరు కోనప్ప, శాసన సభ్యులు ఆత్రం సక్కు , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ, అడిషనల్ కలెక్టర్ రాజేశం, రామగుండం కమిషనర్ సత్యనారాయణ, జిల్లా ఎస్‌పి వై వి ఎస్ సుధీంద్ర, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి మణెమ్మ, డిపిఓ శ్రీకాంత్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగరావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు కోనేరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వేలాది మంది అమరవీరుల త్యాగఫలం తెలంగాణ: రవికుమార్‌యాదవ్
ఎంతోమంది ఉద్యమకారుల ప్రాణ త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బిజెపి నాయకులు రవికుమార్‌యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నిర్వహించిన వేడుకలకు హాజరైన రవికుమార్‌యాదవ్ స్థానిక కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకల్లో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్, ఎన్టీఆర్ నగర్ బిజెపి నాయకులు విఠల్, విజయ్, సుబ్రహ్మణ్యం శ్రీరాములు, నర్సింగ్ నాయక్, శ్రీశైలం, రంగస్వామి, రమేష్, ప్రకాష్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్: కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి
సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ ఏర్పాటు దిశగా నడిపిస్తున్నారని చందనగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి అన్నారు. చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలకు హాజరైన ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి , నాయకులు గురుచరణ్ దుబే, మిర్యాల రాఘవరావు, లక్ష్మీనారాయణ గౌడ్, రవిందర్ రావు , జనార్దన్ రెడ్డి, మల్లేష్, అక్బర్ ఖాన్, ఎల్లయ్య, కృష్ణ దాస్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
చందానగర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సర్కిల్ ఉపకమీషనర్ సుధాంశ్ నందగిరి కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, మంజుల రఘనాథ్‌రెడ్డిలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకలను పురస్కరించుకుని జిహెచ్ఎంసి సిబ్బంది హఫీజ్ పేట్, సైబర్‌టవర్స్ ఫ్లై ఓవర్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు, సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బిజెపి లేకుంటే తెలంగాణ రాష్ట్రం సిద్దించేది కాదు: కసిరెడ్డి భాస్కరరెడ్డి
లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు బిజెపి మద్దతు తెలిపి రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిందని, బిజెపి లేకుండా రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమీ నగర్ కాలనీలో జాతీయ జెండాను భాస్కరరెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె సురేందర్, పగడాల వేణుగోపాల్, రవిబాబు, వెంకటేష్, హన్మంతరావు, పర్వత్ రెడ్డి, గద్దే సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ నగర్ సెక్షన్ కార్యాలయంలో…
బాలాజీ నగర్ సెక్షన్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బాలాజీ నగర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఘంటసాల సుమన్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ మిత్రులకు, కార్మిక సోదర, సోదరీమణులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్, ఫోర్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మెన్లు, ఆర్టిజన్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

తారానగర్ ప్రభుత్వ పాఠశాలలో…
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని తారానగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో నాయకులు దుర్గం వీరేశం గౌడ్, రామచందర్, వార్డ్ మెంబరు కవిత, జనార్ధన్ గౌడ్, ఎస్ఎఫ్ఎ నాగేశప్ప, పారిశుద్ధ్య కార్మికులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
