తండ్రిని కోల్పోయిన బాల్క సుమ‌న్‌ను ప‌రామ‌ర్శించిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌భుత్వ విప్, చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు బాల్క సుమ‌న్ తండ్రి, మెట్‌ప‌ల్లి మార్కెట్ క‌మిటీ మాజీ చౌర్మ‌న్ దివంగ‌త బాల్క సురేష్ చిత్ర‌ప‌టానికి ప్ర‌భుత్వ విప్‌, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ బుధ‌వారం ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారి కుటుంబ స‌భ్యుల‌ను పరామ‌ర్శించిన గాంధీ, వారిలో మ‌నోధైర్యాన్ని నింపారు. బాల్క సురేష్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు. నివాళుల‌ర్పించిన వారిలో కార్పొరేటర్లు ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, మాజి కార్పొరేట‌ర్ రంగారావు, మాదాపూర్ డివిజ‌న్ టీఆర్ఎస్ అధ్య‌క్షులు ఎర్ర‌గుడ్ల శ్రీనివాస్ యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బాల్క సురేష్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న ప్ర‌భుత్వ విప్‌లు ఆరెక‌పూడి గాంధీ, బాల్క సుమ‌న్‌ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, రంగారావు, ఎర్ర‌గుడ్ల శ్రీనివాస్ యాద‌వ్‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here