ఆరోవరోజు 1382 మంది సూపర్ స్పెడర్స్ కు కోవీ షీల్డ్ ఫస్ట్ డోస్ పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో ఆరవ రోజు సూపర్ స్పెడర్స్ వ్యాక్సినేషన్ యదావిధిగా కొనసాగింది. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో బుధవారం 18 ఏళ్లు పైబడిన వారు 696 మంది, 45 ఏళ్లు పైబడిన వారు 168 కలిపి మొత్తం 864 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో 18 ఏళ్లు పైబడిన వారు 414 మంది, 45 ఏళ్లు పైబడిన వారు 104 కలిపి మొత్తం 518 మంది కోవీ షీల్డ్ మొదటి డోసు తీసుకున్నారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో కేవలం 8 మంది 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకున్నారు . ఐతే కరోనా నిర్ధారణకై 124 ర్యాపిడ్ యాంటీజెన్, 70 ఆర్టీపీసీఆర్ కలిపి మొత్తం 194 టెస్టులు చేశారు. కాగా అందులో 13 మందికి పాజిటీవ్ వచ్చినట్టు సుపరింటెండెంట్ వరదాచారి తెలిపారు.

వ్యాక్సినేష‌న్ కోసం స్టేడియం బ‌య‌ట బారులు తీరిన ల‌బ్దిదారులు

సూపర్ స్పైడర్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అవకతవకలు: యం. రవికుమార్ యాదవ్
శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఐదు రోజులుగా జ‌రుగుతున్న సూప‌ర్ స్ప్రెడ‌ర్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని రాష్ట్ర బిజెపి నాయకులు యం.రవి కుమార్ యాదవ్ అన్నారు. బుధ‌వారం చందాన‌గ‌ర్ పిజెఆర్ స్టేడియంలో జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అధికార టిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు సూప‌ర్ స్ప్రెడ‌ర్‌ల‌కు బ‌దులుగా త‌మ అనుచ‌రులు, బంధువుల‌కు వ్యాక్సిన్ వేయిస్తున్నార‌ని ఆరోపించారు. ఫ‌లితంగా అసలైన లబ్ధిదారులకు వ్యాక్సిన్ అంద‌డం లేద‌న్నారు. స్థానిక అధికారులు సైతం టిఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌కు స‌హ‌క‌రిస్తున్నార‌ని, ఉన్న‌తాధికారులు ఈ విష‌యంలో జోక్యం చేసుకుని అస‌లైన లబ్దిదారుల‌కు వ్యాక్సిన్ అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నాయకులు కంచర్ల ఎల్లేష్, రాధా కృష్ణ యాదవ్ , కసిరెడ్డి రఘు రెడ్డి, రఘునాథ్ యాదవ్, మహేష్ యాదవ్, అర్జున్, మల్లేష్ గౌడ్, హనుమంతు నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏఎమ్‌హెచ్ఒ డా.కార్తిక్ తో మాట్లాడుతున్న బిజెపి నాయ‌కులు ర‌వికుమార్‌యాద‌వ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here