సమాజ నిర్మాణంలో కీలక పాత్ర ఉపాద్యాయుడిదే: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

  • ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి లోని నల్లగండ్ల రవీందర్ రెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి మండల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాద్యాయుడి పేరుతో ఉపాద్యాయ దినోత్సవం జరుపుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగమైందన్నారు.

స్వాతంత్య్రనికి పూర్వం విద్య అందుబాటులో ఉండక పోవడం, ప్రజల మధ్యన అంతరాలు సృష్టించడం వంటి పరిణామాల నేపద్యంలో చిన్న చిన్న దేశాలు కుడా భారతదేశం మీదకు దండయాత్ర కు వచ్చాయని తెలిపారు. ఎందరెందరో ఉన్నతులను తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం పేరుతో వారిని సత్కరించటం అనిర్వచనీయమైన ఘట్టంగా ఆయన వర్ణించారు. అనంతరం కార్పొరేటర్ గారు శేరిలింగంపల్లి మండల్ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తూ, టీచర్ల ను అభినందించి, పదవ తరగతిలో ఉత్తమ ర్యాంక్ సాదించిన విద్యార్థులకు ఆశీస్సులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇస్రో సైంటిస్ట్ రఘునందన్ రావు, ఎన్ ఆర్ ఎస్ సి జి. శ్రీనివాస్ రావు, రమణి సైంటిస్ట్ & ఎన్ ఆర్ ఎస్ సి బిజ్జం వెంకటేశ్వర రెడ్డి, ఎం. వెంకట రెడ్డి, టిఆర్ ఎస్ఎంఏ జనరల్ సెక్రెటరీ ఎస్ ఎన్ రెడ్డి, టిఆర్ ఎస్ఎంఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె అనిల్ కుమార్, ఆర్ఆర్డిఆర్ఎస్పిసిఏ ప్రెసిడెంట్ జి నారాయణ రెడ్డి, ఆర్ఆర్డిఆర్ఎస్పిసిఏ జనరల్ సెక్రటరీ ఏ భరత్ గౌడ్, సన్ షైన్ స్కూల్ డైరెక్టర్ పవన్ కుమార్, ఆర్ఆర్డిఆర్ఎస్పిసిఏ ట్రెజరర్ మీనేందర్ రావు, ప్రెసిడెంట్ మారోజు ఆచార్య, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ శంకర్, డైరెక్టర్ ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఎన్ రఘునందన్ కుమార్, ట్రెజరర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, చీఫ్ అడ్వైజర్ గాయం భీష్మ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ అండ్ టీం ఫ్రొం బ్రహ్మకుమారిస్ బి.కె వసంత లక్ష్మి, సన్ షైన్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ పవన్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here