– బాదిత కుటుంబాలకు నగదుతో పాటు బియ్యం, పండ్లు, బిస్కట్లు పంపిణీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్‌లోని వరద ముంపు బాదితులకు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్‌కుమార్ చేయూతనందించారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేసి సర్వం జలమయమైన నిరుపేదలకు తనవంతు ఆర్ధిక సాయం అందజేశారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ల చేతుల మీదుగా రెండు కుటుంబాలకు రూ.5 వేలు, మూడు కుంటుంబాలకు రూ.3, 2, 1 వేల చొప్పున నగదును అందజేశారు. అదేవిధంగా పలువురికి బియ్యం, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్‌లను అందజేశారు. దాంతో పాటు తారానగర్‌లోని ఇళ్లలోకి చేరిన వరదనీటి తరలింపుకు తనవంతు సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజేపి అసెంబ్లి ఇంచార్జ్ బుచ్చిరెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు మారం వెంకట్, శాంతిభూషన్ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.