హఫీజ్‌పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్, డాల్పిన్ ఎస్టేట్స్, ప్రజాయ్ సిటీ, జనప్రియ అన్ని బ్లాక్ లలో డివిజన్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్‌తో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వరద ముంపు నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థులు ఎదురైన తమకు సమాచారం అందించాలని సూచించారు. కరోనా, విష జ్వరాల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.