మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్‌లోని ప్రజలు భారీ వర్షాల ధాటికి వరదలతో సతమతమవుతున్న వేల ఆ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు, ఎంజీఆర్ ట్రస్టు చైర్మన్ డా.మర్రపు గంగాధర్‌రావు తన ఉదారతను చాటుకున్నాడు. తన స్వంత నిధులతో జేసిబిని ఏర్పాటు చేసి వరద నీటి నిల్వ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాడు. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా ఆశ్రయం కోల్పోయిన నిరుపేదలకు గంగాధర్‌రావు పెద్ద మొత్తంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు తనవంతు భాద్యతగా తోచిన సహకారం అందించానని అన్నారు. డివిజన్ ప్రజలు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే తోచిన విధంగా చేయూనందిస్తానని తెలిపారు. కాగా గంగాధర్ సేవల పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.