– వరద బాదితులను పరామర్శించిన రంజిత్‌రెడ్డి, ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్‌లోని వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీతో కలిసి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి బుదవారం పరిశీలించారు. ఆ ప్రాంతాలు ముంపుకు గురవ్వడానికి గల కారణాలపై వారు ఆరా తీశారు. వరద ఉదృతి నేపథ్యంలో నిరాశ్రయులైన నిరుపేదలు వారు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి సహాయక చర్యలకు ఆదేశించారు. మరో రెండు రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఐతే తప్ప బయటకు రావద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటేశ్వర్లు,డీఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ ,రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు ,విరేశం గౌడ్,హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ తెరాస నాయకులు మిరియాల రాఘవ రావు, ఉరిటీ వెంకట్ రావు, పొడుగు రాంబాబు, పద్మ రావు, చింత కింది రవీందర్, దాసరి గోపి, రాజు, కృష్ణ యాదవ్,నటరాజ్, రమేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.