నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ టాయిలెట్ల నిర్వహణలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని వివేకానందనగర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి ఉప్పల విద్యాకల్పన ఏకాంత్‌గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ బిజెపి అధ్యక్షుడు నర్సింగరావు ఆధ్వర్యంలో మాధవరం కాలనీలో నిరుపయోగంగా పడిఉన్న స్వచ్ఛ హైదరాబాద్ టాయిలెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యకల్పన మాట్లాడుతూ జిహెచ్ఎంసి అధికారులు రూ.3.5- 5 లక్షల వరకు వెచ్చించి రూపొందించిన టాయిలెట్లను ఉపయోగం లేని చోట ఉంచి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు విషయంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు ఉపయోగపడే ప్రాంతాల్లో స్వచ్ఛ హైదరాబాద్ పబ్లిక్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేసి పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు, జిల్లా డిఎన్‌టి సంఘం కన్వీనర్ ఎతరి రమేష్, జిల్లా బిసి అధికార ప్రతినిధి భాస్కర్ గౌడ్, బిజెపి నాయకులు గణేష్ గౌడ్, జితేందర్, బీజేవైఎం అధ్యక్షులు సాయి కుమార్, సంతోష్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.