నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ పీజేఆర్ నగర్ లోగల కుమ్మర్ల స్మశానవాటికను కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి మంగళవారం సందర్శించారు. స్మశానవాటికలో అనేక సమస్యలు నెలకొన్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్మశానవాటికను సందర్శించిన కార్పొరేటర్ సమస్యలను పరిశీలించారు. స్మశాన వాటిక ఆవరణలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిక చుట్టూ వున్న ప్రహరీ గోడ కూలిపోయిందని స్థానికులు తెలిపారు. ప్రహరీ గోడ కూలి పోవటం వల్ల స్మశాన స్థలం ఆక్రమణకు గురవుతుందని, దీని కారణంగా స్మశానంలోకి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వివరించారు. సమస్యలపై స్పందించిన గంగాధరరెడ్డి అధికారులతో చర్చించి త్వరలోనే కొత్త ప్రహరి గోడ నిర్మాణం జరిపించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు నక్క శివ కుమార్ , సీనియర్ నాయకులు రావులకొల్లు వీరయ్య, సాంబయ్య ,ఆర్ విటల్ అయ్యా,ఆర్ శ్రీనివాస్, బిక్షపతి, యాదయ్య, కుమార్, రామకృష్ణ, ఆర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
