శేరిలింగంప‌ల్లి జంట స‌ర్కిళ్ల‌లో ప‌ట్ట‌ణ‌ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంపై స‌మీక్ష స‌మావేశాలు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జిహెచ్ఎంసి ప‌రిధిలోని అన్ని డివిజ‌న్ల‌లో ప‌దిరోజుల పాటు చేప‌ట్ట‌నున్న ప‌ట్ట‌ణ‌ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంపై చందాన‌గ‌ర్‌, శేరిలింగంప‌ల్లి సర్కిల్ అధికారులు ఆయా డివిజ‌న్ల కార్పొరేట‌ర్ల‌తో బుధ‌వారం స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మీష‌న‌ర్ సుధాంశు నంద‌గిరి ఆధ్వ‌ర్యంలో స‌ర్కిల్ కార్యాల‌యంలో కార్పొరేట‌ర్లు జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్, ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్, మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి, పూజిత జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ లు స‌మావేశ‌మ‌వ్వ‌గా, శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ ఉప క‌మీష‌న‌ర్ వెంక‌న్న ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో కార్పొరేట‌ర్లు రాగం నాగేంద‌ర్‌యాద‌వ్‌, గంగాధ‌ర‌రెడ్డిల‌తో పాటు ప‌లు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో స‌మీక్ష స‌మావేశంలో క‌మీష‌న‌ర్ సుధాంశు, కార్పొరేట‌ర్లు

స‌మావేశంలో భాగంగా ప‌ది రోజుల పాటు డివిజ‌న్ల‌లో చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై చ‌ర్చించారు. బస్తిలు, కాలనీలలో ఉన్న చెత్తను తొల‌గించ‌డం, డ్రైనేజీ వ్యవస్థలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసరా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచ‌డం త‌దిత‌ర ప‌నుల‌ను ప్ర‌ధానంగా చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. వార్డులకు నియమించిన నోడల్ అధికారులు, ఇంచార్జ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ప్ర‌భుత్వ విప్ అరికెపూడి గాంధీ, స్థానిక‌ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుని ప‌నిచేయాల‌ని క‌మీష‌న‌ర్లు సూచించారు. ప్ర‌తిరోజూ కాలనీల్లోని బిల్డింగ్ మెటీరియల్, చెత్త, గ్రీన్ వెస్ట్ ను ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల ద్వారా తొలగించి, అన్ని పనులను ప్రధాన కార్యలయం ద్వారా ఇవ్వబడిన ప్రత్యేక ఆప్ లో రికార్డ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌ హెల్త్ ఆఫీసర్ కార్తిక్, ఇంజినీరింగ్ ఈ.ఈ శ్రీకాంతి, డీ.ఈ సురేష్ , రూప దేవి, ఎలక్ట్రికల్ ఏ.ఈ రామ్మోహన్, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ , శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ డీఈ శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ మానవీ తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ కార్యాల‌యంలో స‌మీక్ష స‌మావేశంలో కమీష‌న‌ర్ వెంక‌న్న‌తో కార్పొరేట‌ర్లు రాగం, గంగాధ‌ర‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here