శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జిల్లో స్థానిక పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవలి కాలంలో లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ కార్యక్రమం నిర్వహించారు. పౌరులు అలాంటి కార్యక్రమాలు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని, ప్రజల రక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణే తమకు ముఖ్యమని పోలీసు అధికారులు తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు చేపట్టడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.







